ఆప్‌ మరో ముందడుగు | Sakshi
Sakshi News home page

 ఆప్‌ మరో ముందడుగు

Published Mon, Mar 12 2018 8:30 PM

 AAP MP Sanjay Singh Moves Private Members Bill to stop sealing in Delhi  - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో కొనసాగుతున్న ‘దుకాణాల మూసివేత’(సీలింగ్‌ డ్రైవ్‌)ని నిలిపివేయాలంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) సభ్యుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ సోమవారం రాజ్య సభలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. మొదటి నుంచి దుకాణాల మూసివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ   ప్రైవేటు బిల్లుతో తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. బిల్లుకు మిగతా పార్టీలు మద్దతు ఇవ్వాలని సంజయ్‌ సింగ్‌ కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..‘ఇప్పటి వరకు 14 ప్రయివేట్‌ బిల్లులు మాత్రమే ఆమోదం పొందాయి. అయినా మేము ధైర్యంగా ఈ బిల్లు ప్రవేశ పెట్టాము. బిల్లుకు ప్రతిపక్ష పార్టీలన్నిమద్దతు ఇవ్వాల’ని విజ్ఞప్తి చేశారు. 

నివాస ప్రాంతాల్లో కొనసాగుతున్న దుకాణాలను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా సీజ్‌ చేస్తున్నారని ఆరోపించారు. సీలింగ్‌ డ్రైవ్‌ వల్ల వేలాదమంది వ్యాపారులు జీవనోపాధిని కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో చట్టం చేయడం  లేదా ఆర్డినెస్స్‌ జారీ చేయడం ఒక్కటే సీలింగ్‌ డ్రైవ్‌కు పరిష్కారమని ఆప్‌ తొలి నుంచి చెప్తోందని ఆయన గుర్తుచేశారు. 

Advertisement
Advertisement